ధర స్థిరంగా...
- May 05, 2016
కొనుగోళ్లు మందకొడిగా సాగడంతో బంగారం ధర గురువారం స్థిరంగా ఉంది. బుధవారం నాటి ధర రూ.30,100 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగినప్పటికీ దేశీయంగా కీలక సమయాల్లో కొనుగోళ్లు జరగకపోవడంతో దీని ధర స్థిరంగా ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.3 శాతం పెరిగి 1,283.44 అమెరికన్ డాలర్లకు చేరింది.గురువారం వెండి ధర పెరిగింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.4శాతం పెరిగి 17.41 యూఎస్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







