యూపీఐ పేమెంట్ల పై పరిమితి..
- March 13, 2023
న్యూ ఢిల్లీ: మనీ ట్రాన్సాక్షన్స్‌ను యూపీఐ పేమెంట్స్ సులభతరం చేసిన సంగతి తెలిసిందే. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. డబ్బున్నట్లే. యూపీఐ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా వెంటనే చెల్లించవచ్చు. అవసరమైన వారికి ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో డబ్బు పంపొచ్చు.
కానీ, యూపీఐ పేమెంట్స్ విషయంలో పరిమితి ఉన్న సంగతి తెలిసిందే. డైలీ లిమిట్ దాటితే పేమెంట్ చేయలేరు. చాలా మంది ఈ సమస్యను ఏదో ఒక రోజు ఎదుర్కొనే ఉంటారు. డైలీ పేమెంట్స్ లేదా ట్రాన్స్ఫర్ లిమిట్ దాటిపోతే ఆ రోజు ఈ సమస్య ఎదురవుతుంది. అయితే, ఈ లిమిట్ అందరికీ ఒకేలా ఉండదు. ఎందుకంటే బ్యాంకును బట్టి యూపీఐ పేమెంట్స్ లిమిట్ మారుతుంది. ఒక్కో బ్యాంకు లిమిట్ ఒక్కోలా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం.. ఒక యూపీఐ అకౌంట్‌కు అనేక బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గరిష్టంగా యూపీఐ ద్వారా ఒక రోజుకు లక్ష రూపాయలు మాత్రమే పంపొచ్చు.
అది కూడా అన్ని బ్యాంక్ అకౌంట్స్‌కు కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిట్ రోజుకు రూ.1 లక్ష. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిట్ కూడా రూ.1 లక్ష. అయితే, కొత్త కస్టమర్లు రూ.5,000 మాత్రమే పంపొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ అయితే రోజుకు రూ.10,000 మాత్రమే పంపొచ్చు. అదే గూగుల్ పే ద్వారా అయితే, ఈ లిమిట్ రూ.25,000గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ పరిమితి రూ.1 లక్ష. బ్యాంక్ ఆఫ్ బరోడా పరిమితి రూ.25,000.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







