మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్
- March 14, 2023
అమరావతి: ఏపీ సీఎం జగన్..మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని సీఎం హెచ్చరించారు. మంగళవారం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం కొనసాగింది.
ఈ సమావేశంలో సీఎం జగన్, మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు. జులై నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని తెలిపారు. 7 స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గెలవాలన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని సీఎం హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. గత నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామో.. అసెంబ్లీ వేదికగా అంశాలవారీగా మాట్లాడాలని మంత్రులకు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







