‘శాకుంతలం’ సినిమా గురించి సమంత ఏమన్నదంటే.!
- March 15, 2023
సమంత లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
ఫైనల్‌గా ఏప్రిల్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు ఫిక్స్ అయ్యారు. తాజాగా హైద్రాబాద్ పెద్దమ్మ తల్లి వద్ద ఆశీర్వాదాలు తీసుకుంది ‘శాకుంతలం’ టీమ్. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. తనకు డిస్నీ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
హుందా అయిన సినిమాలెన్ని చేసినా, తనలోని చిన్నతనం లోపల అలాగే వుంటుందని క్యూట్ క్యూట్‌గా చెప్పుకొచ్చింది సమంత. ‘శాకుంతలం’ సినిమా ఒప్పుకోవడానికి అదీ ఓ కారణమని తెలిపింది.
‘శాకుంతలం’ సినిమా డిస్నీ సినిమాలాగే వుంటుందనీ, ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినందుకు సంతోషంతో కూడిన గర్వం పొందుతున్నాననీ సమంత చెప్పింది.
అన్నట్లు ఈ సినిమాలో అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







