వచ్చే వారం రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు
- March 18, 2023మస్కట్: ఒమన్ సుల్తానేట్ మార్చి 19(ఆదివారం) నుండి మార్చి 23(గురువారం) వరకు ఐదు రోజుల పాటు వాయు ద్రోణి వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని పౌర విమానయాన అథారిటీ (CAA) శుక్రవారం తెలిపింది. నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ తాజా వాతావరణ అప్డేట్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం నుండి ధోఫర్ మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం నుండి మిగిలిన గవర్నరేట్లలో వర్షాలు ప్రారంభం అవుతాయని తెలిపింది. 15 నుండి 25 kt (28-45km/h) వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర తీరప్రాంతాల వెంబడి సముద్రం 2-3 మీటర్ల గరిష్ట అలల ఎత్తుతో కల్లోలంగా ఉంటుంది. వర్షపాతం సమయంలో నౌకాయానం వద్దని, వాతావరణ బులెటిన్లు, నివేదికలను అనుసరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఏఏ సూచించింది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!