బహ్రెయిన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్
- March 19, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు యూరోపియన్ జాతీయులు, ఒక జీసీసీ జాతీయుడు, ఒక అరబ్ మహిళ, ముగ్గురు బహ్రెయిన్‌లు ఉన్నారు. వీరికి సంబంధించిన కేసులో తుది వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. నేరారోపణలు నిరూపణ అయితే వీరికి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్షలు పడే అవకాశం ఉంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ పోలీసు అధికారి డ్రగ్స్ కావాలంటూ ముఠా సభ్యుడిని ఆశ్రయించాడు. బీడీ 120 విలువైన కొకైన్‌ను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఫ్ జిల్లాలో ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి చేరుకున్న ముఠా సభ్యుడు.. డ్రగ్స్‌ను అందజేయగానే పోలీసు అధికారులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి BD8,000 నగదుతో సహా భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంలో ముఠాలోని మిగతా సభ్యులను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!