ఇంటర్నెట్ వినియోగదారుల్లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ..
- March 20, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో (వైర్లెస్, వైర్ కనెక్షన్) తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.మొదటి స్థానాన్ని కేరళ సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే వంద మందిలో 80మందికిపైగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారు ఉన్నారు. వీటిలో కేరళ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో తెలంగాణ, మూడు, నాలుగు స్థానాల్లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
దేశంలో వంద మందిలో 67 మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉందని తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక తెలంగాణకు పోరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలో వంద మందిలో 67 మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. చివరి స్థానంలో బీహార్ రాష్ట్రం నిలిచింది. ఆ రాష్ట్రంలో వంద మందికి కేవలం 37 మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఢిల్లీని రాష్ట్రంగా కాకుండా ఒక నగరంగా పరిగణలోకి తీసుకున్నారు. ఇక్కడ ప్రతీ 100 మందికి 202 ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.
నివేదిక ప్రకారం.. తెలంగాణలో 11.5 మిలియన్ల గ్రామీణ సబ్ స్క్రైబర్లు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో వారి సంఖ్య 20 మిలియన్లు. పట్టణ ప్రాంతాలు 100 జనాభాకు 110 ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నారు. ఇందుకు కారణం.. రాష్ట్రంలో మొబైల్ నెట్వర్క్ టవర్ల నిర్మాణంకు అనుమతులు వేగంగా మంజూరు చేయడం ద్వారా ఇంటర్నెట్ సౌలభ్యం ఎక్కువ ప్రాంతాల వారికి అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తమ సొంత అవసరాలకోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లను కలిగి ఉండటంలో దేశంలోని మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







