భార్యతో మరోసారి నటించాలని ఉంది : సూర్య
- May 06, 2016
మంచి కథ దొరికితే భార్య జ్యోతికతో కలిసి నటిస్తానని తమిళ స్టార్ హీరో సూర్య అంటున్నాడు. నేడు సూర్య హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ '24' విడుదలైంది. ఇందులో సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించాడు. ముందుగా ఏప్రిల్ నెలాఖరున సినిమా రిలీజ్ కు ప్లాన్ చేసినా టాలీవుడ్ లో సరైనోడు రిలీజ్ ఉండటంతో కొన్ని రోజులు వాయిదా వేశామని తెలిపాడు. మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి జ్యోతిక కూడా సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే.సూర్యతో వివాహం తర్వాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక సుమారు తొమ్మిదేళ్ల తరువాత ఇటీవల 36 వయదినిలే అనే తమిళ చిత్రంలో నటించగా, సూర్య అతిథి పాత్రలో కనిపించి ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచాడు. మరోసారి జ్యోతికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని, ఈ నెలఖరులోగా సూర్య తన తర్వాతి ప్రాజెక్టు వివరాలు వెల్లడిస్తానన్నాడు. ఇప్పటికే భార్య జ్యోతికతో కలిసి 5 తమిళ సినిమాల్లో నటించినట్లు తెలిపాడు. ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా తన బ్యానర్ లోనే తీయాలనుకుంటున్నాని, అందుకే ఓ మంచి కథ కోసం వేట మొదలు పెట్టినట్లు సూర్య వివరించాడు.
తాజా వార్తలు
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!









