11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- February 25, 2026
యూఏఈః జైపూర్ నుండి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం దాదాపు 11 గంటలు ఆలస్యం తర్వాత సర్వీస్ ను రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు దుబాయ్‌కు బయలుదేరాల్సి ఉంది. అయితే, ఫ్లైట్ రాడార్ తో సహా వివిధ విమాన ట్రాకింగ్ వెబ్సైట్లు విమానం రద్దు అయినట్లు తెలిపాయి.
ఉదయం ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని, రోజంతా విమానాశ్రయంలోనే గడిపినట్లు బాధిత ప్రయాణీకులలో ఒకరైన అంకుర్ చెప్పారు. చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, కొంతమంది టెర్మినల్ భవనం వెలుపల నిలబడి ఉన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







