మహేష్‌తో శ్రీలీల డబుల్ ధమాకా.? నిజమేనా.?

- March 23, 2023 , by Maagulf
మహేష్‌తో శ్రీలీల డబుల్ ధమాకా.? నిజమేనా.?

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్దే మెయిన్ హీరోయిన్ కాగా, శ్రీలీలకీ ఓ మంచి రోల్ ఇచ్చారు గురూజీ త్రివిక్రమ్.

అయితే, తాజాగా ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. మహేష్ తదుపరి రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నారనేదే ఈ గాసిప్ సారాంశం. 

ఒకవేళ అదే జరిగితే, శ్రీలీల స్టార్‌డమ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. గ్లోబల్ రేంజ్‌ని టచ్ చేసేయడం ఖాయం.. అంటూ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే నిజంగానే రాజమౌళిని శ్రీలీల అంతలా ఇంప్రెస్ చేసిందా.? 

అయినా, రాజమౌళి తీయబోయే మహేష్ సినిమా కోసం ఆల్రెడీ బోలెడంత క్రేజ్ వున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు క్యూలో వున్నారు. మరి, వాళ్లందర్నీ కాదని ఇప్పుడిప్పుడే ఇమేజ్ దక్కించుకుంటోన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్‌గా తీసుకుంటాడా.? ఏమో గుర్రం ఎగరా వచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com