సంయుక్తకు కోపమొచ్చింది.! ఎందుకో తెలుసా.?
- March 23, 2023
‘భీమ్లా నాయక్’ సినిమాలో రానాకి భార్యగా నటించిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. డెబ్యూ హిట్‌తో పాటూ, అమ్మడు నటించిన తదుపరి సినిమాలు ‘బింబిసార’, ‘సార్’ తదితర సూపర్ హిట్లతో సంయుక్త పేరు కూడా టాలీవుడ్‌లో బాగానే వినిపిస్తోంది.
ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘విరూపాక్ష’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. వెరీ సూన్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర యూనిట్‌పైనే సంయుక్త గుస్సా అవుతోందట. అందుకు కారణం లేకపోలేదు.
ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారట. అయితే, అది జరగలేదు. దాంతో, మాటిచ్చి ఇలా మోసం చేస్తారా.? అని సోషల్ మీడియా వేదికగా ‘విరూపాక్ష’ టీమ్‌పై రుసరుసలాడింది సంయుక్త.
అయితే, అనుకోని కారణాలతో సంయుక్త లుక్ రిలీజ్ చేయలేకపోయామనీ, త్వరలోనే రిలీజ్ చేస్తామనీ సంయుక్తకు టీమ్ సారీ చెప్పడంతో, సంయుక్త శాంతించింది. అయితే, సంయుక్త ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది. సినిమాకి ఇదో టైప్ డిఫరెంట్ పబ్లిసిటీగా పనికొచ్చినట్లయ్యింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







