ప్రవాస భారతీయులకు భారతీయ రైల్వే బంపర్‌ ఆఫర్‌

- May 06, 2016 , by Maagulf
ప్రవాస భారతీయులకు భారతీయ రైల్వే బంపర్‌ ఆఫర్‌

ప్రవాస భారతీయులు, విదేశీయులు ఇకపై భారతదేశంలో రైల్వే రిజర్వేషన్లను సులువుగా చేయించుకోవచ్చు. రైలు టిక్కెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆనలైన్‌లో బుక్‌ చేసుకునేందుకు అంతర్జాతీయ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించవచ్చు. ఐఆర్‌సిటిసి సీఎండి ఏకా మనోచా మాట్లాడుతూ విదేశాల్లో ఉంటూ అంతర్జాతీయ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి భారతదేశంలో రైల్వే రిజర్వేషన్‌ చేయించుకోవచ్చని తెలిపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అవసరమైన మార్పులుచేశామని తెలిపారు. విదేశీ పర్యాటకులు చాలా కాలంగా ఇటువంటి సదుపాయం కావాలని కోరుతున్నారన్నారు. నేరుగా ఈ టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే ఇతర ఏజెన్సీలపై ఆధారపడాల్సిన అవసరం తమకు ఉందని వారుచెబుతున్నారన్నారు. ఇప్పటి వరకు విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచి రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకోవాలంటే అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డులకు మాత్రమే అనుమతి ఉండేది. విదేశీ పర్యాటకులు ఎక్కువగా బుద్దిస్ట్‌ సర్క్యూట్‌ రైళ్ళు, ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌, మహారాజా వంటి లగ్జరీ రైళ్ల కోసం టిక్కెట్లను టూర్‌ ఆపరేటర్ల ద్వారా బుక్‌ చేయించుకునేవారు. ఇప్పుడు ఇక స్వయంగా ఐఆర్‌సిటీసీ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా బుక్‌ చేసుకునే అవకాశం వారికి లభించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా సెకనుకు 250 టిక్కెట్లు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 58శాతం టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్‌ అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com