ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..

- March 28, 2023 , by Maagulf
ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..

ఇజ్రాయెల్: కొత్త న్యాయచట్టానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. ప్రజాగ్రహంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు దిగొచ్చారు. కొత్త న్యాయచట్టం విషయంలో బెంజిమన్ నెతన్యాహు పునరాలోచనలో పడ్డారు. న్యాయ వ్యవస్థలో మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలపై ఇటు ప్రజల్లో అటు మంత్రుల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతుండటంతో కొత్త న్యాయ చట్టం అమలుుపై ఆయన వెనకడుగు వేశారు.

కొత్త న్యాయ చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు ప్రజలు ఆందోళనలతో ఇజ్రాయెల్ అట్టుడుకుతోంది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. వేల మంది దేశ రాజధాని జెరూసలెంలోని వీధుల్లోకి వచ్చి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవ్యవస్థలో మార్పుల కోసం నెతన్యాహు తీసుకొస్తున్న కొత్త న్యాయ చట్టాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు, ప్రజలు నిరసన చేపడుతున్నారు.

జాతీయ జెండాను పట్టుకుని ప్రధాన వీధుల్లో నిరసన చేపడుతున్నారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు సైన్యం వాటర్ కెనాన్స్ ను ప్రయోగించింది. ప్రజల ఆందోళనకు వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులు, సిబ్బంది సైతం మద్దతు తెలిపారు. సమ్మెకు మద్దతుగా కార్యాలయాలు మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు.

దీంతో విదేశాల్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. మరోవైపు ఎయిర్ పోర్టు ఉద్యోగ సంఘాలు సైతం ప్రజల పోరాటానికి మద్దతు ప్రకటించడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఆ దేశంలోని అతి పెద్ద ట్రెడ్ యూనియన్ కూడా మద్దతు ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com