జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ

- March 28, 2023 , by Maagulf
జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ

విశాఖపట్నం: ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సు-2023కు  విశాఖ ముస్తాబైంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందీకరణ పనులు చేపట్టడంలో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి. రహదారులు, డివైడర్లు, ఫుట్ పాత్ లను సుందరంగా తీర్చిదిద్దారు. అథితులను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలకరించారు. ముఖ్యంగా సాగర తీరం అందంతోపాటు ఆకర్షణీయంగా విద్యుత్ దీపాల సుందరీకరణలతో దేదీప్యమానంగా అద్దంగా మెరిసిపోతోంది.

సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. జీ-20 అధ్యక్షత దేశంగా ఈసారి భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో హోమ్ ఎర్త్.. హోమ్ ఫ్యామిలీ.. హోమ్ ఫ్యూచర్ అనే థీమ్ తో సదస్సును నిర్వహిస్తోంది. ఏడాదిపాటు సదస్సులు వివిధ ప్రాంతాల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులు నిర్వహించబోతోంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ నగరాన్ని కేంద్రం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో విశాఖలో మూడు రోజులపాటు సదస్సు నిర్వహిస్తోంది. ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, విద్య, వైద్యం తదితర అంశాలపై 37 సమావేశాలు జరుగుతాయని జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటికే జీ-20 సదస్సులో భాగంగా ఇంటర్ సెక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం నగరంలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లో 22న జరిగింది.ఈ సదస్సు విజయవంతం అయ్యేలా ప్రజలను సైతం భాగస్వామ్యం చేసేందుకు పలు రకాల కార్యక్రమాలు చేపట్టారు.

జీ-20 సదస్సుకు వేలాది మంది వివిధ దేశాల ఆర్థిక మంత్రులు విదేశాంగ మంత్రులు, సెంట్రల్ బ్యాంక్స్ గవర్నర్స్ పాల్గొననున్నారు. జీ-20 సదస్సుకు 40 దేశాల నుంచి 200 వరకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరవుతారు. మంగళవారం ఉదయం 10 గంటలకు జీ-20 సమావేశాలు ప్రారంభమవుతాయి. బుధవారం ర్యాడిసన్ హోటల్ సమీపంలో బీచ్ లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణుల చేత అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. అదే రోజు మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన జరుగుతుంది.

30వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ ఉంటుంది. దీనిలో భాగంగా కాపులపాడు ప్రాంతంలో విదేశీయుల పర్యటన ఉంటుంది. 2,500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం ఏపీ సీఎం జగన్ విశాఖకు రానున్నారు. జీ-20 డెలిగేట్స్ తో సీఎం జగన్ ఇంటరాక్షన్ కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com