హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..

- March 28, 2023 , by Maagulf
హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..

హైదరాబాద్: RRR సినిమా నాటు నాటు సాంగ్ కు ప్రపంచ అత్యున్నత సినీ పురస్కారం ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.RRR టీం ఇండియాకు వచ్చిన తర్వాత అభినందనలతో పాటు పలువురు సత్కారాలు కూడా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నాటు నాటు పాట రాసిన గేయ రచయిత చంద్రబోస్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున రవీంద్రభారతిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.ఈ కార్యక్రమంలో చంద్రబోస్ తండ్రి నర్సయ్య, ఆర్ నారాయణ మూర్తి, పలువురు కవులు, కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ ని ఘనంగా సన్మానించి అభినందించారు.

చంద్రబోస్ సన్మాన కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ ఆస్కార్ అవార్డు సాధించడం మహా అద్భుతం. ఆస్కార్ విజేతలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గొప్పగా సత్కరించాలి. అప్పుడు అందరు కళాకారులు సంతోషిస్తారు. ఈ పాటలో వాడిన తెలంగాణ మాండలికానికి ఆస్కార్ తో మహా గౌరవం దక్కింది అని అన్నారు.

తెలంగాణ టూరిజం, స్పోర్ట్స్, కల్చర్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమా అది కూడా తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం ఎంతో గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఆస్కార్ విజేతలను ఘనంగా సన్మానిస్తుంది. సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలోనే RRR టీమ్ ను గొప్పగా సత్కరించుకుంటాం. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అది చంద్రబోస్ పాటల్లో కనిపిస్తుంది. చంద్రబోస్ పాటతో తెలంగాణ కాదు, యావత్తు దేశానికే గొప్ప పేరు తెచ్చారు. తెలంగాణ పదానికి ఆస్కార్ పట్టం కట్టింది ఎంతో సంతోషంగా ఉంది. కొత్త, యువ రచయితలు రావాలి, దాని కోసం ప్రభుత్వ సహకారం ఉంటుంది. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఎప్పటికి ఉంటుంది అని అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ మాట్లాడుతూ.. ఆస్కార్ వేదికపై తొలిసారి నమస్తే, పొలం పదం పలికింది చెప్పలేని ఆనందం ఇచ్చింది. నాటు నాటుకు ఇప్పటికే నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. 28ఏళ్ళలో 3600 పాటల నా సినీ ప్రయాణానికి మరిచిపోలేని సంఘటన ఆస్కార్ అవార్డు. నాటు నాటు పాట కోసం పంతొమ్మిది నెలలు పడిన కష్టానికి ఆస్కార్ తో అరుదైన గౌరవం దక్కింది అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com