మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- March 28, 2023
మెక్సికో: మెక్సికోలోని ఓ వలసదారుల కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు 39 మంది మృతి చెందగా, 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సిన్ నగరంలోని నేషనల్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్(INM) సిబ్బంది అగ్నిప్రమాదాన్ని ధ్రువీకరించారు.ఈ ఐఎన్‌ఎం శిబిరంలోని పార్కింగ్ స్థలంలో పదుల సంఖ్యలో మృతదేహాలను దుప్పట్లలో కప్పి ఉంచినట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది.ఈ ప్రమాదంలో 29 మందికి గాయాలైనట్లు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమయంలో ఈ శిబిరంలో 70 మంది శరణార్థులు ఉన్నట్లు, వారిలో అధికులు వెనిజువెలాకు చెందిన వారని తెలుస్తోంది. ఈ శిబిరం స్టాంటన్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్‌కు దగ్గర్లో ఉంటుంది. అమెరికాలోకి ప్రవేశించేందుకు సియుడాడ్ జువారెజ్ ముఖ్యమైన ప్రాంతం. అగ్రరాజ్యం ఆశ్రయం కోరిన అనేక మంది.. అధికారిక ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక్కడి వలసదారుల కేంద్రంలోనే ఉంటారు. ఈరోజు రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం