ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- March 28, 2023అమెరికా: అమెరికా హెచ్-1బీ వీసాల కోసం తగినన్ని అప్లికేషన్లు వచ్చాయని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఒక ప్రకటనలో తెలింది. 2024 అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయని, అర్హత సాధించిన వారికి సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని తెలిపింది. అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపులతో హెచ్-1బీ కేటాయింపులకు కావాల్సిన సంఖ్యకు చేరుకున్నట్లు తెలిపింది.
పరిమితిని చేరుకోవడానికి వచ్చిన అప్లికేషన్ల నుంచి రెండమ్‌లో ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన రిజిస్ట్రేషన్లతో పిటీషనర్లందరికీ హెచ్-1బీ క్యాప్‌కు అప్లికేషన్లు పెట్టుకునేందుకు అనుమతి ఇస్తారు. 2024 ఆర్ధిక సంవత్సరానికి ఎంపికైన అర్హత ఉన్న పిటీషన్‌దారులు ఏప్రిల్ 1, 2023 నుంచి యూఎస్ సిటీజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌కు అప్లికేషన్ పెట్టుకోవచ్చని తెలిపింది. కేవలం ఎంపికైన రిజిస్ట్రేషన్ ఉన్న పిటీషనర్లు మాత్రమే 2024 కోసం అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము