అరబిక్ - లాంగ్వేజ్ ఆఫ్ ఫ్యూచర్
- May 07, 2016
లాంగ్వేజ్ ఆఫ్ ఫ్యూచర్‌గా అరబిక్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అభిప్రాయపడ్డారు. ఐదవ అరబిక్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో షేక్ మొహమ్మద్ మాట్లాడారు. మేథమేటిక్స్ మరియు మెడికల్ బుక్స్‌లోనూ చాలావరకు అరబిక్‌లో రాయబడ్డాయనీ, అవి ఇతర భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయనీ, చాలా అరబిక్ టెర్మ్స్ ఇంకా పలు విదేశీ భాషల్లో ఉపయోగించబడ్తున్నాయనీ, దానికి కారణం అరబిక్ భాషలోని ఫ్లెక్సిబిలిటీయేనని ఆయన చెప్పారు. అరబిక్ లాంగ్వేజ్‌ని విశవ్యాపితం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. మొహమ్మద్ బిన్ రషీద్ అరబిక్ లాంగ్వేజ్ అవార్డ్‌ని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ విజేతలకు అందజేశారు. స్విస్ బేస్డ్‌న 'దర్ అల్ ఫరా' ఇన్‌స్టిట్యూట్ ఈ అవార్డును సొంతం చేసుకుంది. సౌదీ అరేబియాకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎస్సెస్‌మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 'బెస్ట్ ఇనీషియేటివ్ టు టీచ్ అరబిక్ ఎట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్' కేటగిరీలో అవార్డును దక్కించుకుంది. యూఏఈకి చెందిన షేక్ మొహమ్మద్ బిన్ ఖాలిద్ అల్ నహ్యాన్ సెంటర్, అరబిక్ రీడింగ్ కేటగిరీలో అవార్డును గెలచుకుంది. బైట్ అల్ లుఘా అరబిక్ స్మార్ట్ అప్లికేషన్ కేటగిరీలో అవార్డును అందుకుంది. అరబైజేషన్ అండ్ ట్రాన్స్‌లేషన్ ప్రాజెక్ట్ కేటగిరీలో కింగ్ అబ్దుల్ అజీజ్ సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డును దక్కించుకుంది. అరబ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ (అలెస్కో) స్పెషల్ అవార్డును గెలచుకుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







