ఖరీదైన కారు కొనుగోలు చేసిన ముకేశ్
- June 21, 2015
పారిశ్రామిక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్).. ఛైర్మన్ ముకేశ్ అంబానీ కోసం ప్రపంచంలో అత్యంత అధునాతన, భద్రమైన(బుల్లెట్ ప్రూఫ్) కారును కొనుగోలు చేసింది. అనూహ్య దాడులను ఎదుర్కొనేందుకు వీలుగా లెవెల్-9 వెహికిల్ రెసిస్టెన్స్(వీఆర్9) టెక్నాలజీతో డిజైన్ చేసిన మెర్సిడెజ్ బెంజ్ ఎస్600 కారును జర్మనీ నుంచి తెప్పించింది. ప్రపంచంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అత్యంత భద్రత కవచదారి సాంకేతికత ఇదే. అంతేకాదు, దేశంలో తొలి వీఆర్9 టెక్నాలజీ ఎస్600 మోడల్ కూడా. జర్మనీలోని సిండెలింగెన్‌లో ఉన్న బెంజ్ ప్లాంట్‌లో దీన్ని రూపొందించారు. బెంజ్ ఎస్600 కనిష్ఠ ధర రూ.1.5 కోట్లు. ఇంకా వీఆర్9 టెక్నాలజీ ఫిట్టింగ్‌లు, విదేశం నుంచి దిగుమతి చేసుకున్నందున చెల్లించిన సుంకం, ఇతర చార్జీలు, బీమా ప్రీమియం అన్నీ కలిపి మొత్తం రూ. 11 కోట్ల వరకు ఖర్చయి ఉండొచ్చని అంచనా. శనివారం ముంబై సెంట్రల్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో ఈ వాహన రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా పూర్తయినట్లు తెలిసింది. ముకేశ్ అంబానీకి మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2013 నుంచే జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. తాజాగా ఆయన భద్రత కవచంలోకి బెంజ్ ఎస్600 కూడా చేరింది. అధునాతన భద్రతతో కూడిన కార్లను కొనుగోలు చేస్తున్న పారిశ్రామిక, రాజకీయ ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎందుకంటే 2015 మోడల్ ఎస్600 డెలివరీ వెయిటింగ్ లిస్ట్‌లో ఆర్‌ఐఎల్‌ది 57వ స్థానం కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







