తెలంగాణకు మరోసారి జాతీయ అవార్డుల పంట
- April 07, 2023
హైదరాబాద్: తెలంగాణకు మరోసారి జాతీయ అవార్డుల పంట పండింది. నేషనల్ పంచాయతీ అవార్డులు-2023లో అద్భుత ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నిలిచింది. దేశంలో నెంబర్ వన్ తో పాటుగా వరసగా 4 ఉత్తమ అవార్డులు దక్కాయి.ఎంపిక చేసిన మొత్తం 9 వివిధ కేటగిరిల్లో తెలంగాణకు 8 కేటగిరీల్లో ఉత్తమ అవార్డులు వచ్చాయి.ఈ అవార్డులను కేంద్రం త్వరలోనే రాష్ట్రానికి అందచేయనుంది.దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు.మంత్రి ఎర్రబెల్లిని, ఆయన టీమ్ ని ఆయన అభినందించారు.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారాయన.
దేశంలోనే మరోసారి తెలంగాణకు చెందిన 4 గ్రామాలు వివిధ విభాగాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి.
1. ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్
2. సరిపోను మంచినీరు అందుబాటులో ఉన్న విభాగంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల
3. సామాజిక భద్రత గల గ్రామాల విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్ పల్లి
4. స్నేహపూర్వక మహిళా గ్రామాల విభాగంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం అయిపూర్
5. పేదరిక నిర్మూలన, జీవనోపాధులు పెంచిన గ్రామాల విభాగంలో గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం
6. సుపరిపాలన గ్రామ పంచాయతీల విభాగంలో వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం చీమల్ దారి
7. క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్ పూర్
8. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్ రావు పేట మండలం గంభీర్ రావు పేట గ్రామం దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







