మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- August 25, 2026
మనామా: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని విచారణ పూర్తయ్యే వరకు కస్టడీలో ఉంచాలని బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది.
ఉత్తర గవర్నరేట్ ప్రాసిక్యూషన్ అధిపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇస్లామిక్ ప్రముఖులు, మతపరమైన చిహ్నాలను అవమానించేలా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసి, సామాజిక శాంతి, ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ తెలిపింది.
ఈ కేసును జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ-కరప్షన్, ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీకి చెందిన సైబర్క్రైమ్ యూనిట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించింది. విచారణలో భాగంగా నిందితుడిని ప్రశ్నించిన అధికారులు, సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలు మరియు అందులోని వ్యాఖ్యలపై అతడిని ప్రశ్నించారు. అనంతరం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తు నిర్బంధానికి ఆదేశించారు.
బహ్రెయిన్ చట్టాల ప్రకారం అభిప్రాయ వ్యక్తీకరణ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మతాచరణ హక్కులు హామీ ఇవ్వబడ్డాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే మతపరమైన ప్రముఖులను అవమానించడం లేదా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం ఈ హక్కుల పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. సామాజిక శాంతి, సహజీవనానికి ముప్పు కలిగించే వ్యాఖ్యలు లేదా చర్యలపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







