ఏపీలో 39 ఐపీఎస్ అధికారుల బదిలీ..
- April 08, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీలో 39 ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రెండు రోజుల క్రితమే 57 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం వెంటనే 39 మంది ఐపీఎస్ లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. కీలక ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఏలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్ కుమార్ ను నియమించింది. గుంటూరు రేంజ్ ఐజీగా జీ.పాలరాజు నియమించడంతోపాటు దిశా ఐజీగాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
అనంతపురం రేంజ్ డీఐజీగా ఆర్ఎన్.అమ్మిరెడ్డి, సెబ్ డీఐజీగా ఎమ్.రవి ప్రకాశ్, ఏపీఎస్పీ డీఐజీగా బి.రాజకుమారి, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోయ ప్రవీణ్‌ను డీఐజీ గ్రేహౌండ్స్‌కు బదిలీ, శంఖబ్రత బాగ్చీ శాంతిభద్రతల ఏడీజీగా బదిలీతోపాటు ఏడీజీగా అడ్మీన్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రవిశంకర్ అయ్యనార్ విజిలెన్స్ ఏఎన్ఫోర్స్మెంట్ ముఖ్య కార్యదర్శిగా బదిలీ, అతుల్ సింగ్ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెట్ బోర్డు ఛైర్మన్, ఏపీఎస్పీ ఏడీజీగాను అదనపు బాధ్యతలు అప్పగించింది.
సీహెచ్ శ్రీకాంత్ ను సీఐడీ ఐజీగా బదిలీ, మనీశ్‌కుమార్ సిన్హా ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. పి.వెంకటరామిరెడ్డి ఎండీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కి బదిలీ, సీఎం త్రివిక్రమ్ వర్మ – విశాఖ సిటీ కమిషనర్ గా నియమించింది. విక్రాంత్ పాటిల్ – పార్వతీపురం మన్యం ఎస్పీగా బదిలీ, వాసన్ విద్యా సాగర్ నాయుడు – లా అండ్ ఆర్డర్ డీసీపీ, విశాఖ సిటీ, గరుడ్ సుమిత్ సునీల్ – ఎస్పీ,SIBగా బదిలీ, తుహిన్ సిన్హా – ఎస్పీ, అల్లూరి జిల్లాగా నియమించారు.
ఎస్.సతీష్ కుమార్ – కాకినాడ జిల్లా ఎస్పీ, ఎం. రవీంద్రనాధ్ బాబు -GAD కి రిపోర్ట్, కేవీ మురళి కృష్ణ – అనకాపల్లి జిల్లా ఎస్పీ, గౌతమి శాలి – APSP 16వ బెటాలియన్ కమాండెంట్, సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, పి.శ్రీధర్ – కోనసీమ జిల్లా ఎస్పీ, డి.మేరీ ప్రశాంతి – ఏలూరు జిల్లా ఎస్పీ, రాహుల్ దేవ్ శర్మ – APSP 5వ బెటాలియన్ కమాండెంట్, తిరుమలేశ్వర్ రెడ్డి – నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించారు.
సీహెచ్ విజయరావు -APSP 3వ బెటాలియన్ కమాండెంట్, ఆర్.గంగాధర్ రావు – అన్నమయ్య జిల్లా ఎస్పీ, వి.హర్షవర్ధన్ రాజు – సీఐడీ ఎస్పీ, కె.శ్రీనివాసరావు – అనంతపురం ఎస్పీ, ఫకీరప్ప – సీఐడీ ఎస్పీ, ఎస్వీ మాధవ్ రెడ్డి – సత్య సాయి జిల్లా ఎస్పీ, రాహుల్ దేవ్ సింగ్ – విజయవాడ రైల్వే ఎస్పీ, జి.కృష్ణ కాంత్ – కర్నూల్ ఎస్పీ, సిద్దార్ద్ కౌశల్ – ఆక్టోపస్ ఎస్పీ, అజిత వేజెండ్ల – విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట), పి.జగదీష్ – APSP 14వ బెటాలియన్ కమాండెంట్, బిందు మాధవ్ గరికపాటి – గ్రే హౌండ్స్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









