మునిగిపోతున్న 15 మందిని రక్షించిన ఒమన్ నేవీ

- April 08, 2023 , by Maagulf
మునిగిపోతున్న 15 మందిని రక్షించిన ఒమన్ నేవీ

మస్కట్: ముసందమ్ గవర్నరేట్‌లోని సముద్రంలో సాంకేతిక లోపంతో మునిగిపోతున్న పడవలో ఉన్న 15 మందిని ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. ముసందమ్ గవర్నరేట్‌లో ఎనిమిది మంది పౌరులు, ఏడుగురు నివాసితులతో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన పడవను రక్షించినట్లు ఒమన్ రాయల్ నేవీ వెల్లడించింది. పడవలో సాంకేతిక లోపం ఏర్పడిందని, అది సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఖసాబ్ అని పిలువబడే ఈ పడవను ముసందమ్ గవర్నరేట్‌లోని ఉమ్ అల్-ఘనామ్ ద్వీపానికి దక్షిణం నుండి ఒక నాటికల్ మైలు దూరంలో గుర్తించిన ఒమన్ రాయల్ నేవీ.. దానిని రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ బోట్ సాయంతో ముసందమ్ నేవల్ బేస్‌కు తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com