అయ్యో పాపం.! ‘మీటర్’ హీరోకి కమర్షియల్ షాక్ ఇచ్చారే.!
- April 08, 2023కిరణ్ అబ్బవరం.. ఈ పేరు ఇప్పుడు యూత్ ఐకాన్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఈ కుర్ర హీరో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మొన్నీ మధ్యనే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా చేశాడు. ఒకింత పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.
ఈ ఊపులోనే మరో కొత్త సినిమా రిలీజ్ చేసేశాడు మనోడు. మాస్ రాజా రవితేజతో పోటీగా ‘మీటర్’ అనే సినిమాతో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం.
కమర్షియల్‌గా ఈ సినిమా కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుందని అంచనా వేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా చేశారు. అయితే, సీను రివర్స్ అయ్యింది.
ఫస్ట్ డే టాకే వీక్‌గా వచ్చేసరికి ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమే అంటున్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సక్సెస్ భ్రమలో కూడా ‘మీటర్’ కొట్టుకుపోయేలా కనిపించడం లేదు. కమర్షియల్ స్టాండర్డ్ అనుకుంటే, ‘మీటర్’తో ఫేటే మారిపోయేలా వుంది కిరణ్ అబ్బవరానికి.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?