బర్త్‌డే స్పెషల్: రాకింగ్ బన్నీ.! మెగాస్టార్ ‘చిరు’ విషెస్.!
- April 08, 2023
ఈ రోజు (ఏప్రిల్ 8) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41 వ బర్త్‌డే సందర్భంగా ఆయన తాజా మూవీ ‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో కాళీ మాత అవతారాన్ని పోలిన పవర్ ఫుల్ గెటప్‌లో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా బన్నీకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ పోటెత్తుతున్నాయ్.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్‌లో బన్నీకి బర్త్‌డే విషెస్ చెప్పారు.
హ్యాపీ బర్త్ డే డియర్ బన్నీ ‘పుష్ప 2 ది రూల్’ లుక్ రాకింగ్‌గా వుంది అంటూ ఆయన విష్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
‘పుష్ప 2’కి సంబంధించి ఇప్పటికే టీజర్ రిలిజ్ చేశారు. ఈ టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంటోంది. అలాగే ఈ నేపథ్యంలోనే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ బన్నీ ఫ్యాన్స్‌లో హుషారు తెప్పిస్తోంది.
ఈ లుక్‌ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన క్రేజ్‌తో రెండో పార్ట్‌కి సంబంధించిన ప్రతీ అప్‌డేట్ అంతకు మించిన క్రేజ్‌తో వుండాలి. అందుకు తగ్గట్లుగానే అప్డేట్లు ప్లాన్ చేస్తున్నారు ‘పుష్ప’ మేకర్స్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







