కరివేపాకు కహానీ.! ఇది మీకు తెలసా.?
- April 08, 2023
కూరల్లో కరివేపాకు అంటే ఎంత చిన్నతనమో. అడ్డొస్తే, నిర్మొహమాటంగా తీసి పక్కన పడేస్తుంటాం. కానీ, ఆఫ్ట్రాల్ కరివేపాకే అని తీసి పడేస్తే తప్పులో కాలేసినట్లే సుమా. కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే మరి.
కరివేపాకులో కార్మినేటివ్ గుణం వుంది. ఇది అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. ఉదయం వచ్చే వికారాలూ, నీరసాలని తగ్గించడంలో కరివేపాకు దోహదపడుతుంది.
కరివేపాకులో క్రిమినాశక గుణాలుండడం వల్ల చర్మ గాయాలను నయం చేస్తుంది. అంతేకాదు, కాలిన గాయాలకు కరివేపాకు పేస్ట్‌ని పూతలా పూస్తే తొందరగా గాయం నయం కావడంతో పాటూ, తద్వారా వచ్చే మచ్చల్ని కూడా నియంత్రిస్తుంది.
కరివేపాకులో వుండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. దాంతో, చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడంలో కరివేపాకు మంచి ఔషధంగా పని చేస్తుంది.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో శక్తివంతంగా పోరాటం చేస్తుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







