మెగా రాకుమారుడి డబుల్ యాక్షన్ ధమాకా.!

- April 08, 2023 , by Maagulf
మెగా రాకుమారుడి డబుల్ యాక్షన్ ధమాకా.!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదట్నుంచీ తాను ఎంచుకునే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. కంటెంట్ రిచ్ సినిమాలకే ఎక్కువ ప్రాథాన్యత ఇస్తుంటాడు.
అందులో భాగంగానే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవ ధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఇదో డిఫరెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది.
దీంతో పాటూ మరో యాక్షన్ మూవీలోనూ వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
గగన తలంలో హీరో చేసే యాక్షన్ ఘట్టాలు అబ్బుర పరిచేలా వుంటాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ఈ యాక్షన్ ఘట్లాలను డిజైన్ చేశారట. మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో చాలా హుందాగా, కొత్తగా కనిపించబోతున్నాడు మెగా రాకుమారుడు వరుణ్ తేజ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com