‘ఏజెంట్’ హంగామా షురూ అయ్యిందిగా.!
- April 08, 2023
అక్కినేని హీరో అఖిల్ నుంచి వస్తోన్న చిత్రం ‘ఏజెంట్’. ఇంతవరకూ చేసిన మూడు సినిమాలూ అఖిల్‌ని స్టార్‌గా నిలబెట్టలేకపోయాయ్. ఇక, ఇప్పుడు రాబోతున్న ‘ఏజెంట్’ ఏం చేస్తుందో చూడాలి మరి.
‘ఏజెంట్’ కోసం అఖిల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు మరి. లుక్స్ పరంగా, బాడీ ఫిజిక్ పరంగా తనను తాను చాలా మార్చేసుకున్నాడు. మేకోవర్ కోసం అఖిల్ స్పెషల్ డైట్ ఫాలో చేస్తూ కష్టపడ్డాడు.
ఆ కష్టమంతా సినిమాతో తీరితే ఫర్వాలేదు కానీ, లేకుంటే, డిజప్పాయింట్‌మెంటే. పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ‘ఏజెంట్’ రూపొందింది.
సాక్షి వైద్య హీరోయిన్‌గా పరిచయమవుతోన్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. గతేడాది డిశంబర్‌లో వస్తుందనుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతోంది.
విడులకు మూడు వారాలు మాత్రమే వుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. ప్రమోషన్లలో చాలా ఇన్నోవేటివ్ థాట్స్ చేస్తున్నారు మేకర్లు. ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లను చాలా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి, అఖిల్‌ని ‘ఏజెంట్’ అయినా ఆదుకుంటుందో లేదో.!
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







