భారత్ లో కరోనా అప్డేట్
- April 09, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,357 కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరుకుంది. వైరస్ కు మరో 11 మంది బలయ్యారు.
గుజరాత్లో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్లో ఇద్దరు, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం డేలీ పాజిటివిటీ రేటు 3.39% గా, కవరీ రేటు 98.74 శాతంగా ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్నీ రాష్ట్రాలకు సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







