హైదరాబాద్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు
- April 09, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.ప్రభుత్వం తీరును నిరసిస్తూ శనివారం గాంధీ మెడికల్ కాలేజీ ఎదుట వారు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.తమకు హైజీనిక్, సెక్యూరిటీతో కూడిన వసతిగృహాలను కేటాయించాలని, ఎన్ఎంసీ నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాల్లో పనిచేసే పీజీ డాక్టర్లకు ఆహార సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తర్వు కరిష్ని మాట్లాడుతూ....డిమాండ్లు పరిష్కరించాలి లేకపోతే ఈనెల 11 నుంచి డ్యూటీలు బహిష్కరిస్తామని తెలిపారు.ఈ ఆందోళనలో గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తర్వు కరిష్ని, రాష్ట్ర జూనియర్ డాక్టర్ల జనరల్ సెక్రటరీ డాక్టర్ అఖిల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కౌశిక్ జోషి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







