భారత్ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్ల పంపిణీ
- April 09, 2023
కువైట్ సిటీ: పవిత్ర రమదాన్ మాసంలో మానవతా విలువలను నిర్మించి, నిలబెట్టే ఆనందం, కృతజ్ఞత మరియు సహకారం అనే భావనను పెంపొందించడానికి ఈ సంయుక్త ప్రయత్నం ఒక సాధనం.కువైట్ లో ఉంటున్న ముస్లిం సోదరులకు భారత్ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో లో ఇఫ్తార్ కిట్లు పంపిణీ జరిగింది.
భారత్ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఇఫ్తార్ కిట్ల పంపిణీ నీ చేయడం తోటి ముస్లిం సోదరులకు సహాయపడటం మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.
భారత్ జాగృతి కువైట్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మార్క , ట్రెజరర్ మామిడిపల్లి రాజన్న మాట్లాడుతూ కువైట్ లో ఉంటున్నా తెలంగాణ సోదరులకు భారత్ జాగృతి కువైట్ ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తుంది అని అన్నారు.
NRI BRS కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ...పవిత్ర రమదాన్ మాసంలో ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం లాగానే భారత్ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్స్ పంపిణీ చేయడం సంతోషం గా ఉంది అన్నారు మరియు అందరికీ రమదాన్ ముబారక్ అలాగే ముందస్తు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గల్ఫ్ కాపు సంఘం కువైట్ అధ్యక్షులు జీలకర్ర మురళి రాయల్, NRI BRS కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)




--
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







