2023 జీసీసీ ఎకానమీలో ఒమన్ టాప్: ప్రపంచ బ్యాంకు
- April 09, 2023
మస్కట్: ఒమన్ 2023లో 4.3 శాతం అంచనా వృద్ధితో ఆరు జీసీసీ దేశాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచ బ్యాంకు GCC అంతటా GDP వృద్ధి మందగించడాన్ని అంచనా వేసింది. అక్టోబర్‌లో 3.7% అంచనా నుండి GCC కోసం 2023 ఆర్థిక వృద్ధి అంచనాను 3.2%కి సవరించింది. చమురు కోసం డిమాండ్ తగ్గుతున్నా.. ఒమన్ హైడ్రోకార్బన్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ద్వారా వృద్ధి కొనసాగుతుందని నివేదికలో అంచనా వేశారు. ప్రత్యేకించి కొత్త సహజ వాయువు క్షేత్రాల అభివృద్ధికి ఒమన్ భారీగా పెట్టుబడులు పెడుతుందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జిడిపి వృద్ధి రేటు 3.6 శాతం, ఖతార్ 3.3 శాతం, బహ్రెయిన్ 3.1 శాతం, సౌదీ అరేబియా 2.9 శాతంగా అంచనా వేయబడింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండగా.. ఒమన్‌లో దేశీయ ద్రవ్యోల్బణం చాలా తక్కువగా నమోదు అయినట్లు నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







