ఆన్‌లైన్ లో బైక్ సేల్ పేరిట Dh44,000 మోసం.. ఇద్దరికి జైలుశిక్ష
- April 10, 2023
దుబాయ్: షాపింగ్ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసి ఆన్‌లైన్ షాపింగ్ చేసే వ్యక్తిని 44,000 దిర్హామ్ లు మోసం చేసిన ఇద్దరు ఆఫ్రికన్‌లకు దుబాయ్ మిస్‌డిమినర్ కోర్టు ఒక నెల జైలుశిక్ష, ఆ తర్వాత యూఏఈ నుండి బహిష్కరణ విధించింది. గల్ఫ్ పౌరుడిని మోసం చేసినందుకు దోషులుగా తేలిన తర్వాత వారిని ఇంటర్నెట్‌ను ఉపయోగించకుండా నిషేధించారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా 22,000 దిర్హామ్‌లకు బైక్‌ను అమ్ముతానని బాధితుడిని మోసం చేశారు. బీమా, కస్టమ్స్ ఫీ వంటి కారణాలతో రెండుసార్లు బాధితుడి నుంచి నిందితులు Dh44,000 వసూలు చేశారు. చివరకు షిప్‌మెంట్‌ను డెలివరీ చేయడానికి 5,000 దిర్హామ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసానికి గురైనట్లు గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు నిందితులిద్దరిని దోషులుగా తేల్చి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







