క్రేన్‌కు విద్యుత్ తీగ తగలడంతో.. ఇద్దరు మృతి
- April 10, 2023
కువైట్: సాల్మీ స్క్రాప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఉపవాసం విరమించే(ఇఫ్తార్) సమయానికి కొన్ని క్షణాల ముందు మృత్యువాత పడటం స్థానికంగా అందరినీ కలచి వేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న క్రేన్ విద్యుత్ తీగలకు తాకడంతో ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగకు, వాహనం తీసుకెళ్తున్న క్రేన్‌కు మధ్య ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. వెంచ్‌పై ఉంచేందుకు వాహనాన్ని ఎత్తుతుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి డ్రైవర్, వాహన యజమాని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ ను డిస్‌కనెక్ట్ చేసి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







