విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సమాధానం చెప్పాలి: ఏపీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు
- April 11, 2023
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించిన విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ తీసుకొస్తుందన్నారు. త్వరలో రాహుల్ గాంధీ విశాఖలో పర్యటిస్తారని గిడుగు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మీడియా సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







