జీతాల సంక్షోభం..సమ్మెలోకి పీఐఏ పైలట్లు!
- April 13, 2023
యూఏఈ: పాకిస్తాన్ జాతీయ ఫ్లాగ్ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA)లో జీతాల సంక్షోభం తలెత్తింది. దీంతో పీఐఏ పైలట్లు తమ విధులను బహిష్కరించి.. సమ్మేలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా ఔట్లెట్ ARY న్యూస్ నివేదించింది. నిధుల కొరత కారణంగా నెలల తరబడి తన ఉద్యోగులకు జీతాలు తరచూ ఆలస్యం అవుతున్నాయి. నగదు కొరత కారణంగా పే స్కేల్లు 5 నుండి 10 వరకు ఉన్న అధికారులకు .. సిబ్బంది, పైలట్లకు రమదాన్ నెలలో జీతాలు చెల్లింపులు జరుగలేదని ఏఆర్వై తెలిపింది. పీఐఏకు రూ.400 బిలియన్లకు పైగా పన్ను అప్పులు ఉన్నాయని నివేదించింది.దీని కోసం ఇటీవల రూ.45 బిలియన్ల ప్రభుత్వ బెయిలౌట్‌ను కూడా కోరినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) క్యారియర్ ఖాతాల నుండి రూ.14 బిలియన్లను తగ్గించడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. పైగా వచ్చే వారంలోగా PIA అదనంగా రూ.1.7 బిలియన్ల పన్ను డబ్బును చెల్లించాలని డిమాండ్ చేసింది. కాగా, దీనిపై పీఐఏ ప్రతినిధి స్పందిచారు. విధుల బహిష్కరణల కారణంగా విమాన కార్యకలాపాలను నిలిపివేయడానికి సంబంధించిన నివేదికలను ఖండించారు. పీఐఏ అధికారులకు ఇప్పటికే 1 నుంచి 4 వరకు వేతనాలు చెల్లించామని, 5 నుంచి 10 వరకు ఉన్న పే స్కేల్లలోని సిబ్బందికి మిగిలిన వారికి జీతాలను త్వరలో అందజేస్తామని ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







