స్టాక్ ధరల తారుమారు.. 17 మంది అరెస్ట్
- April 13, 2023
రియాద్: క్యాపిటల్ మార్కెట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 17 మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ప్రకటించింది. సీఎంఏ నుండి లైసెన్స్ పొందకుండానే సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పెట్టుబడిదారుల కోసం రెండు ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలను నిందితుల్లో కొందరు ప్రయత్నించారు. మార్కెట్‌లో లీస్ట్ చేయబడిన అనేక కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేసే లక్ష్యంతో కొనుగోలు ఆర్డర్‌లను ఇవ్వడం ద్వారా అవకతవకలకు పాల్పడ్డారని అథారిటీ పేర్కొంది. సీఎంఏ పెట్టుబడిదారులు, డీలర్లు సెక్యూరిటీలలో తమ లావాదేవీలను అథారిటీ ద్వారా లైసెన్స్ పొందిన క్యాపిటల్ మార్కెట్ సంస్థలకు పరిమితం చేయాలని, లైసెన్స్ లేని వ్యక్తులతో వ్యవహరించవద్దని పిలుపునిచ్చింది. సెక్యూరిటీల వివాదాల పరిష్కారం కోసం కమిటీల జనరల్ సెక్రటేరియట్.. నిందితుల విచారణ, నేరారోపణ తర్వాత అనుమానితుల పేర్లను వెల్లడిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







