ఇఫ్తార్ పంపిణీకి డబ్బులు చెల్లిస్తే..Dh300,000 జరిమానా!
- April 13, 2023
యూఏఈ: అబుధాబిలో పంపిణీ చేయడానికి ఇఫ్తార్ భోజనాన్ని సిద్ధం చేయడానికి రెస్టారెంట్లు, క్యాటరర్లకు చెల్లించడం మానుకోవాలని పౌరులు,నివాసితులకు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (DCD) అబుధాబి సూచించింది. దీనికి బదులుగా స్వచ్ఛంద విరాళాలు, ఆర్థిక సహకారాలు అబుధాబిలోని లైసెన్స్ పొందిన సంస్థల ద్వారా మాత్రమే అందించాలని కోరింది. "అనుమతి పొందకుండానే విరాళాలు సేకరించడం లేదా స్వీకరించడం చేస్తే.. Dh150,000 - Dh300,000 మధ్య జరిమానా, జైలుశిక్ష విధించే అవకాశం ఉందని DCD హెచ్చరించింది.
ఇఫ్తార్ విందులను సిద్ధం చేయడానికి అవుట్సోర్సింగ్, రెస్టారెంట్లకు చెల్లించడం 2021 ఫెడరల్ లా నంబర్ (3), యూఏఈలో నిధుల సేకరణ కార్యకలాపాలు, విరాళాలను నియంత్రించే దాని బైలాను ఉల్లంఘించడమేనని డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. అబుధాబిలో విరాళాలను సేకరించడం, నిర్వహించేందుకు DCD నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. నిధుల సేకరణ లైసెన్స్ పొందిన సంస్థలు మినహా.. స్వచ్ఛంద సంస్థలు, సమాఖ్య, స్థానిక మరియు పౌర సంస్థలు చట్టాల ద్వారా అనుమతించబడతాయని డీసీడీ పేర్కొంది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







