ఈద్ అల్ ఫితర్: ఈనెల 18న ఉద్యోగులకు జీతాలు
- April 13, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల ముందుగానే జీతాలు చెల్లించనున్నట్లు షార్జా ప్రకటించింది. ఈ మేరకు ఎమిరేట్‌లోని సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఏప్రిల్ 18న ఉద్యోగులకు వేతనాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 20 (గురువారం) నుంచి ఏప్రిల్ 23( ఆదివారం) వరకు ఈద్ సెలవులు ఉండే అవకాశం ఉంది. పవిత్ర రమదాన్ మాసం మార్చి 23( గురువారం) ఎమిరేట్స్‌లో ప్రారంభమైంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. చంద్రుడు కనిపించే తేదీనుంచి 29 లేదా 30 రోజుల పాటు ఉపవాసాలను కొనసాగిస్తారు. కాగా, ఈ సంవత్సరం రమదాన్ 29 రోజులు ఉంటుంది. ఈద్ అల్ ఫితర్ పవిత్ర మాసం తర్వాత షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు. హిజ్రీ క్యాలెండర్లో రమదాన్ సెలవులు 2023లో మొదటి లాంగ్ వీకెండ్ గా రానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







