ఆకట్టుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ బుక్ ఫెయిర్

- April 13, 2023 , by Maagulf
ఆకట్టుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ బుక్ ఫెయిర్

 రస్ అల్ ఖైమా: ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే ఫ్లోటింగ్ బుక్ ఫెయిర్ యూఏఈకి తిరిగి వచ్చింది. ఇప్పుడు రస్ అల్ ఖైమాలోని గ్యాంగ్‌ వేల వరకు బైబిలియోఫైల్స్‌ను స్వాగతిస్తోంది. MV లోగోస్ హోప్ యూఏఈని సందర్శించి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 2013లో చివరిసారిగా 5,000కు పైగా ఇంగ్లీష్, అరబిక్ పుస్తకాలతో వచ్చింది. ఇప్పుడు ఇది భారీఎత్తున కొత్త పుస్తకాలు, అనేక సాంస్కృతిక ప్రదర్శనలతో రానుంది. రస్ అల్ ఖైమాలోని పుస్తక ప్రేమికులకు ఇది ఏప్రిల్ 11 నుండి అందుబాటులోకి వచ్చింది. ఇతర ప్రాంతాలకు వెళ్లే ముందు ఏప్రిల్ 16 వరకు ఎమిరేట్‌లో బుక్ ఫెయిర్ నడుస్తుంది. MV లోగోస్ హోప్ వచ్చే వారం దుబాయ్‌కి వెళ్లనుంది. ఏప్రిల్ 18 నుండి 23 వరకు ఎమిరేట్‌లో ప్రదర్శనను ప్రారంభిస్తుంది. మే 17న అబుధాబిలో డాక్ అవుతుంది.  జూన్ 4 వరకు అక్కడే ఉంటుంది. సందర్శకులు ఆన్-సైట్ టిక్కెట్‌లను Dh15 ధరకు కొనుగోలు చేయవచ్చు. MV లోగోస్ హోప్ అనేది జర్మనీలో నమోదు చేయబడిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. 1970 నుండి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు , భూభాగాలలో 49 మిలియన్ల మంది సందర్శకులను స్వాగతించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com