విల్లాల్లో వరుస దోపీడీలు.. నలుగురు దొంగల ముఠా అరెస్ట్
- April 14, 2023
దుబాయ్: ఎమిరేట్‌లోని విల్లాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు లాటినోల అంతర్జాతీయ ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల ముఠా 2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన నగదు, నగలు, గడియారాలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. తాళాలు వేసిన విల్లాలనే ముఠా లక్ష్యంగా చేసుకొని.. చోరీలకు పాల్పడుతుందన్నారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలోని విల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులకు ఏడు నివేదికలు అందడంతో కేసు విచారణ ప్రారంభమైందని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ జమాల్ సలేం అల్-జల్లాఫ్ తెలిపారు. విల్లాల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్లిన సమయంలో దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడేవారని చెప్పారు. ముఠాలోని సభ్యులపై నిఘా పెట్టగా.. ముఠా బ్యాంకు ఖాతాదారుడిని కూడా లక్ష్యంగా చేసుకుని అతని నుండి 60,000 దిర్హామ్‌లకు పైగా దొంగిలించడానికి ప్రయత్నించిందని తెలిపారు. ఒక ముఠా సభ్యుడు బాధితుడి వాహనం టైరుకు పంక్చర్ చేయగా, మరొకరు కారులో పడి ఉన్న డబ్బును దొంగిలిస్తూ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. విచారణలో ముఠా సభ్యులు ATM మెషీన్ల నుండి డబ్బును విత్‌డ్రా చేసిన తర్వాత అతని నగదును దోచుకోవడంతో పాటు విల్లాల్లో ఏడు దోపిడీలు చేసినట్లు అంగీకరించారు. తాము ఇతర దేశాల్లో కూడా ఇలాంటి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దేశాలకు తెలియజేయడానికి దుబాయ్ పోలీసులు ఇంటర్‌పోల్‌తో సమన్వయం చేస్తున్నట్లు అల్-జల్లాఫ్ తెలిపారు. డిపార్ట్మెంట్ తన స్మార్ట్ అప్లికేషన్లో అందించిన "పోలీస్ ఐ" సేవ ద్వారా లేదా కాల్ సెంటర్ 901 లేదా ఎమర్జెన్సీ నంబర్ 999కి కాల్ చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ఉల్లంఘనలను నివేదించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







