భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళి
- April 14, 2023
అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్‌కు ఏపీ సీఎం జగన్ ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ రావు ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దేశం గర్విచదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ అంబేద్కర్ అని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి అని కొనియాడారు. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అని… వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అన్నారు. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేమని చెప్పారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు వేశామని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







