మీ కిడ్నీలు సేఫ్‌గా వున్నాయా?
- April 14, 2023
శరీరంలో ఏ పార్ట్‌కి అనారోగ్యం వచ్చినా అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గుండె తర్వాత శరీర భాగాల్లో ప్రధానమైనవి కిడ్నీలు. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయ్.
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే మన ఆహారపు అలవాట్లే కీలకం. కిడ్నీల ఆరోగ్యానికి కొన్ని రకాల ఆహార పదార్ధాలను అవైడ్ చేయాల్సి వుంటుంది. అవేంటో తెలుసుకుందాం.
వేసవి వచ్చిందంటే, కొందరికి సోడా ఎక్కువగా తాగే అలవాటుంటుంది. సోడాలో పాస్ఫరస్ ఎక్కువగా వుంటుంది. కిడ్నీలకు ఇది హానీ చేస్తుంది. సో, ఈ అలవాటు అధికంగా వుంటే, తగ్గించుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ఆయిల్ ఫుడ్స్ కూడా. ఆయిల్ ఫుడ్స్ కేవలం కిడ్నీలకే కాదు, ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచివి కాదు. అయితే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ అలవాటుంటే, వారి కిడ్నీలు తొందరగా పాడవుతాయ్.
అవకాడో పండు కూడా ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని కొన్ని సర్వేల ద్వారా తేలింది. ఖరీదైన ఈ పండును ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో వుంటుంది. ఇది కిడ్నీలకు హాని చేస్తుంది. అలాగే సోడియం ఎక్కువగా వుండే ఆహార పదార్ధాలను కూడా మితంగా తీసుకుంటే కిడ్నీలకు మంచిది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







