సౌదీ లో పోలీసు స్టేషన్ పైన దాడికి తీవ్రవాదుల ప్రయత్నం
- May 08, 2016
అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క భద్రతా దళాల అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం బాణీ మాలిక్ లో ఉన్న పోలీసు స్టేషన్ హద్దాద్ పై తీవ్రవాద చర్య ద్వారా దాడి చేసేందుకు ముష్కురుల ఒక ప్రయత్నంని సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు.
సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, పోలీసు స్టేషన్ వద్ద భద్రతా అధికారులు విధుల్లో ఉండగా తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో పోలీసు స్టేషన్ సమీపంలో కార్ పార్కింగ్ ప్రాంతం లోకి ఇద్దరు వ్యక్తులు చొరబడే ప్రయత్నం చేశారు. శనివారం, మే 7వ తేది నుంచి పోలీసులు తమ చర్యలను గమనిస్తున్నారని తెలియడంతో తీవ్రవాదులు ఒక మెషిన్ గన్ తో పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిపై ఎదురు తుపాకీ కాల్పులను జరపడంతో తీవ్రవాదులు వారి కోసం ఎదురుచూస్తున్న ఒక వాహనంలో పారిపోయారు .
తర్వాత తీవ్రవాదులు తాము ప్రయాణించిన వాహనంను ధ్వంసం చేశారు. తరువాత, వారు కాలినడకన ఠకీఫ్ గ్రామంలో పర్వత నివాస ప్రాంతాలలోనికి పారిపోయారు. మరియు ఆ ప్రాంతవాసులు సహాయంతో అక్కడ వారు తలదాచుకున్నారు.
భద్రతా దళాల అధికార ప్రతినిధి తెలిపిన సమాచారం ప్రకారం ఎదురెదురు కాల్పులు జరిగిన తర్వాత సయీద్ దాహిబిష్ అల్ హారతి అనే ఒక సైనికుడు మృతి చెందాడు, విస్పొటన నివారణ నిపుణులు ఒక పేలుడు బెల్ట్ ని మరియు తొమ్మిది పైపు బాంబులు స్వాధీనపరచుకొని వాటిని నిర్వీర్యం చేశారు తీవ్రవాదుల కోసం సైనికులు శోధన జరుపుతున్నారని ఏమైనా వివరాలు లభ్యమైతే వెంటనే ప్రకటిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







