తెలంగాణలో మే 10న ఇంటర్ ఫలితాలు…15న పదో తరగతి ఫలితాలు
- April 17, 2023
హైదరాబాద్: తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న మొదలై ఏప్రిల్ 11తో ముగిశాయి. ఈ నేపథ్యంలో, వచ్చే నెలలో ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మే 10న ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంసెట్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి.
అటు నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఇంటర్ పరీక్ష ఫలితాలను వేగంగా తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు కృషి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఇక, తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యాబోధన ప్రారంభం కానుంది. అందుకోసం, టెన్త్ ఫలితాల వెల్లడి కోసం విద్యాశాఖ త్వరపడుతోంది. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం, ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి, మే 15న ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







