OMR 9.6 మిలియన్ల విరాళం అందజేసిన భారతీయ సంతతి వ్యాపారవేత్త
- April 17, 2023
మస్కట్: రాబోయో 10 ఏళ్లలో OMR9.6 మిలియన్లతో అనాథలు, నిరుపేద కుటుంబాల కోసం 300 ఇళ్లను నిర్మించేందుకు చేపట్టిన 'SAS' ప్రాజెక్ట్ కోసం కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై అల్ రహ్మా అసోసియేషన్ ఫర్ మదర్‌హుడ్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, 'శోభా' గ్రూప్ సంతకం చేశాయి. ఈ ఎంఓయూపై అల్ రహ్మా అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్‌వుమన్ సనా అబ్దుల్ రెహ్మాన్ అల్ ఖంజరీ, శోభా గ్రూప్ వ్యవస్థాపకుడు- చైర్మన్ పీఎన్‌సీ మీనన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా పిఎన్‌సి మీనన్ మాట్లాడుతూ.. “ఒకరి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఆహారం, గృహం, విద్య. కాబట్టి, ఏ కుటుంబానికైనా ఇల్లు చాలా ముఖ్యమైన విషయం. అందుకే అనాథలు, నిరుపేదల కోసం గృహనిర్మాణం చేద్దాం అనుకున్నాను. అందుకే పదేళ్లలో 300 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం. కానీ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. నేను 7 డాలర్లతో ఒమన్ వచ్చాను. ఒమన్ నాకు అన్ని ఇచ్చింది.’’ అని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. భూములు ఉంటే ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయడంతోపాటు భూమిని ఇచ్చే వారికి లేదా నివాసయోగ్యం కాని ఇంటిని కలిగి ఉన్న వారికి ప్రత్యేక ఇళ్లను నిర్మించడం వంటివి అందిస్తుంది. ఒక్కో ఇంటికి నిర్మాణ విస్తీర్ణం 200 చదరపు మీటర్లు కాగా.. ఒక్కో ఇంటి నిర్మాణానికి OM35,000 కేటాయించారు. ఒమన్ సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జర్ ఆధ్వర్యంలో ఎంఓయూపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి.
తాజా వార్తలు
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!







