తేజుకి ‘విరూపాక్ష’ ఓ అగ్ని పరీక్ష.!
- April 18, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ శుక్రవారం ‘విరూపాక్ష’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తేజు నుంచి వస్తున్న సినిమా ఇది.
యాక్సిడెంట్‌కి గురైన తర్వాత చాలా కాలం అజ్ఞాతంలోనే వుండిపోయాడు తేజు. అసలు సాయి ధరమ్ తేజ్‌కి ఏమైంది.? అంటూ రకరకాలుగా అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల పాటూ దాదాపు ఓ సంవత్సరం పాటు మీడియానీ, అభిమానుల్నీ ఫేస్ చేయలేకపోయాడు తేజు.
ఇంతమంది అభిమానుల అభిమానమే తనను మళ్లీ సినిమాల్లోకి వచ్చేలా చేసిందని తాజాగా ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజు ఎమోషనల్ అయ్యాడు.
ఫ్యాన్స్ కోసం చేసిన సినిమానే ‘విరూపాక్ష’ అనీ తేజు చెప్పాడు. సుకుమార్ నిర్మాణంలో ఆయన కథతో రూపొందిన చిత్రమిది. కార్తిక్ దండు అను కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ కట్టబెడతారో చూడాలి మరి.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







