రమదాన్ టైమింగ్స్ - యుఏఈ లేబర్ చట్టం
- May 09, 2016
పవిత్ర రమదాన్ సందర్భంగా యుఏఈ లేబర్ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. రమదాన్ మాసంలో పని వేళల్ని రెండు గంటలు తగ్గించాలి. ఈ తగ్గింపు ఉపవాసం చేసేవారికి, చెయ్యనివారికి, అలాగే ముస్లిం కానివారికీ వర్తిస్తుంది. అయితే డిఐఎఫ్‌సి పరిధిలో మాత్రం కేవలం ఉపవాసం ఉండేవారికి మాత్రమే పనివేళల తగ్గింపు వర్తిస్తుంది. మిగతావారికి పని వేళలు మామూలుగానే ఉంటాయి. యూఏఈ లేబర్ చట్టం ఆర్టికల్ 65 ప్రకారం పనివేళలు రోజుకి 8 గంటలు లేదా, వారానికి 48 గంటలు. అయితే హోటల్స్, ట్రేడ్, కేఫిటేరియాలు, సెక్యూరిటీ ఇతర ఉద్యోగాలకు ఈ పనివేళల సమయం 9 గంటలుగా ఉంది. పనిదినాల్లో పనివేళల కుదింపుతో జీతానికి ఎలాంటి కోతలు ఉండకూడదు. 6 గంటలకు మించి అదనపు సమయం పనిచేయించుకుంటే వాటిని ఓవర్‌టైమ్‌గా గుర్తించాలి. ఆరు గంటలు పనిచేయించుకుని, ఇంటి వద్ద మరో రెండు గంటలు పనిచేయించుకోవాలనుకోవడం కుదరదు. పనివేళల విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







