బహ్రెయిన్‌లో తాజా నోట్ల కొరత..!
- April 22, 2023
బహ్రెయిన్: ఈద్ సందర్భంగా ప్రియమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఈద్ సంప్రదాయాలలో ఒకటి. కొత్త దుస్తులు, స్వీట్ బాక్సులు, తాజాగా ముద్రించిన బ్యాంకు నోట్లను సాధారణంగా ఇస్తుంటారు. బహ్రెయిన్ లో తాజా నోట్లను పొందడం కష్టంగా మారిందని, ప్రత్యేక సందర్భాలలో తాజా నోట్ల కొరత వేధిస్తుందని ఓ బ్యాంకర్ తెలిపారు. తాజా నోట్లకు భారీగా డిమాండ్ ఉందని, ప్రత్యేకించి ఈద్ సమయంలో పౌరులు, నివాసితుల తాజా బ్యాంకు నోట్ల కోసం డిమాండ్ ఉందన్నారు. బ్యాంకులు ఈ కొత్త నోట్లను కొన్ని గంటలపాటు మాత్రమే పంపిణీ చేస్తున్నాయని, అవి త్వరగా అయిపోతున్నాయని అధికారి తెలిపారు.
680 మిలియన్ నోట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ తాజా గణాంకాల ప్రకారం.. 680 మిలియన్ల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటిలో 150 మిలియన్ దినార్లు బ్యాంకుల్లో ఉండగా.. 530 మిలియన్ దినార్లు మార్కెట్ సర్క్యులేషన్ లో ఉన్నాయి. అదే విధంగా 200 మిలియన్ల నాణేలు చెలామణిలో ఉన్నాయని గణంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, 40 మిలియన్ల హాఫ్ దినార్ నోట్లు, 25.60 మిలియన్-దినార్ నోట్లు, 7.38 మిలియన్ ఐదు-దినార్ నోట్లు, 7.16 మిలియన్ పది-దినార్ నోట్లు, 25.66 మిలియన్ ఇరవై-దినార్ నోట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







