‘పొన్నియన్ సెల్వన్ 2’.! ఈ సారేం చేస్తాడో మణిరత్నం.!
- April 22, 2023
పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ మణిరత్నం అద్భుత సృష్టిగా రిలీజ్‌కి ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. నిర్మాణంలో భారీతనం, కాస్టింగ్ రిచ్‌నెస్.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయ్.
మణిరత్నం టేకింగ్ పైనా అందరూ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ, రిలీజ్ తర్వాత ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోలేకపోయింది. రెండో బాహుబలిగా రికార్డులు కొల్లగొడుతుందనుకున్న ‘పొన్నియన్ సెల్వన్ 1’కి కనీసపాటి ఆదరణ కూడా దక్కలేదు.
ఇక, ఈ సినిమాకి రెండో పార్ట్ రిలీజ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 28న ‘పొన్నియన్ సెల్వన్ 2’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ముఖ్యంగా సినిమాలోని ప్రధాన తారగణం అంతా ప్రపంచంలోని మెయిన్ సిటీల్లో విహరిస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల తదితరులు ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఐశ్వర్యా రాయ్ డబుల్ రోల్‌లో కనిపించనుంది. మొదటి పార్ట్‌లో డబుల్ రోల్ గురించి కాస్త గోప్యత పాఠించారు. ఈ పార్ట్‌లో ఆ పాత్రను మరింత హైలైట్ చేయనున్నారనీ మొదటి పార్ట్‌లోనే హింట్ ఇచ్చారు. చూడాలి మరి, ‘PS 2’ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో.!
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







